News November 22, 2024
MDK: నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నేడు జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ తెలిపారు. అండర్-8, 10, 12 విభాగాల్లో బాలబాలికలకు పరుగు పందెం, త్రో, జంప్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 9:00లోపు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 99630 05540 నంబరుకు సంప్రదించాలన్నారు.
Similar News
News November 1, 2025
మెదక్: బ్యాడ్మింటన్ టోర్నీ విజేతలు వీరే..

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్లో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలు వీరే. ఓపెన్ కేటగిరీలో డా. కార్తీక్, నాగవర్ధన్ జోడీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, డీఎస్పీ ప్రసన్నకుమార్, నాగేంద్ర 2వ స్థానంలో నిలిచారు. 40ఏళ్లు పైబడిన విభాగంలో ప్రవీణ్, అశ్విన్లు విజేతలుగా నిలిచారు. మహిళా విభాగంలో వీణ, మౌనిక జోడీ ప్రథమ స్థానంలో నిలిచారు. త్వరలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.
News October 31, 2025
మెదక్: ‘మహిళల, బాలికల భద్రతకే షీ టీమ్స్’

మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. వేధింపులకు గురైనవారు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెలలో జిల్లాలో 17 ఎఫ్ఐఆర్లు, 13 ఈ-పిటి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే 69 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 88 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.
News October 31, 2025
తూప్రాన్: మళ్లీ కనిపించిన పులి

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి మళ్లీ శుక్రవారం కనిపించింది. మల్కాపూర్ – దాతర్ పల్లి మార్గమధ్యలో గుండుపై సేద తీరుతూ శుక్రవారం ఉదయం కనిపించింది. బుధవారం కనిపించిన ప్రదేశంలోనే మళ్లీ పులి కనిపించడంతో అక్కడే మకాం వేసినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.


