News December 8, 2025

MDK: పల్లెల్లో పోరు.. సర్పంచ్ పీఠం ఎవరికో!

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రసవత్తరంగా మారాయి. పల్లెల్లో అన్నదమ్ముల్లాగా ఉన్న వారు ఎన్నికలు రాగానే ఆపోజిట్ అభ్యర్థులుగా మారుతున్నారు. ఎన్నడో గ్రామాలను వదిలి వెళ్లిన వారు సైతం గ్రామంలోకి వచ్చి నామినేషన్ వేస్తున్నారు. ఎన్నికల దావత్‌లతో పల్లెల్లో జోరు కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ గ్రామాల్లో సర్పంచ్ పీఠం ఎవరికి దక్కునో.. మరీ మీ ప్రాంతంలో!

Similar News

News February 17, 2026

జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడల్లో మెదక్ జిల్లా అధికారి

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ న్యూఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ తరఫున మెదక్ జిల్లా నుంచి తూప్రాన్ ఎంపీడీవో నూతికట్టు సతీష్ జాతీయ స్థాయి క్యారమ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. పురుషులు, మహిళల విభాగాలకు చెందిన 16 మంది సభ్యుల బృందానికి ఆయన కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాణిస్తున్న సతీష్‌ను పలువురు అధికారులు అభినందించారు.

News February 17, 2026

MDK: భార్య ఛైర్‌పర్సన్.. భర్త కౌన్సిలర్!

image

రామాయంపేట మున్సిపాలిటీలో భార్య భర్తలు మున్సిపాలిటీలో అడుగు పెట్టారు. భార్య గజవాడ లావణ్య ఒకటో వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. భర్త నాగరాజు ఏడవ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది మున్సిపాలిటీలో రెండవసారి అడుగుపెట్టారు. భార్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఛైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భార్య ఛైర్ పర్సన్, భర్త కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.

News February 17, 2026

పాపన్నపేట: వనదుర్గమ్మకు బోనం సమర్పించిన జోగిని

image

పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల దుర్గామాత అమ్మవారికి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి జోగిని శ్యామల బోనం సమర్పించారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు. యేటా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.