News October 6, 2025

MDK: ‘పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి’

image

స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, శాంతి భద్రతలతో సజావుగా జరిగేలా ప్రతి పోలీస్ అధికారి కృషి చేయాలని మెదక్ ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. మెదక్‌లో ఎన్నికల నియమాలపై అధికారులకు అవగాహన శిక్షణ ఏర్పాటు చేశారు. ప్రతి అధికారి గ్రామాలను సందర్శించి పరిస్థితులను అవగాహన చేసుకోవాలని, ఎలాంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి శిక్షణ అందజేశారు.

Similar News

News October 6, 2025

మనోహరాబాద్: కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట శివారులోని నోబుల్ ఫార్మసీ కళాశాలలో తూప్రాన్ డివిజన్ పరిధి ఆరు మండలాలకు ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. నోబుల్ కళాశాలలో సౌకర్యాలు, భద్రత, ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తూప్రాన్ తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

News October 6, 2025

మెదక్: జిల్లాను వదలని వాన.. భారీ వర్షం

image

మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొద్దిరోజులుగా వర్షాలు జిల్లాలో వదలడం లేదు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్‌లలో నమోదైన వర్షపాతం వివరాలు.. కొల్చారం 65.3 మిమీ, అల్లాదుర్గం 58.8, పెద్ద శంకరంపేట 57.0, మిన్పూర్ 47.3, టేక్మాల్ 46.3, లింగంపల్లి 44.8, చిన్న శంకరంపేట 44.5, బుజరంపేట 38.3, కౌడిపల్లి 34.5, చిట్కుల్ 22.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 6, 2025

మెదక్: NMMS ఉపకార వేతనాలకు నేడే చివరి తేదీ

image

నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్షిప్ (NMMS) ఉపకార వేతనాల దరఖాస్తుకు ఈనెల 6 చివరి తేదీ అని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ప్రభుత్వ, ZPHS, ఆదర్శ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ఆసక్తి గల వారు www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు.