News September 20, 2025

MDK: పాలన వ్య‌వ‌స్థ పూర్తిగా నిర్వీర్యం: హ‌రీశ్‌ రావు

image

కాంగ్రెస్ ప్ర‌భుత్వ 22 నెల‌ల పాల‌న‌లో గ్రామీణ వ్య‌వ‌స్థ పూర్తిగా నిర్వీర్యమైందని హ‌రీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ గ్రామ పాలన వ్యవస్థను బలంగా చేస్తే, కాంగ్రెస్ కుప్ప కూల్చిందని మండిప‌డ్డారు. గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్లకు డిజిల్ పోయించే డబ్బులు లేక మూలన పడేసిన దుస్థితి ఏర్ప‌డింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. బతుకమ్మ పండుగ పూట కూడా వీధిదీపాలు వెలగక గ్రామాలు చీకటిలో ఉన్నాయని పేర్కొన్నారు.

Similar News

News September 20, 2025

ప్రార్థన ఎలా చేయాలి?

image

ప్రార్థన అంటే నోటితో పలికే మాట కాదు. అది మనసులో నుంచి రావాలి. ఈ దైవ స్ఫురణలో ప్రేమ, భక్తి జాలువారాలి. అప్పుడే మనసులోని చీకటి తొలగిపోయి, దైవ కాంతి ప్రకాశిస్తుంది. మన కోర్కెలు తీర్చే ఆ భగవంతుడికి మనం ఏమి కోరుతామో ముందే తెలుస్తుంది. అందుకే ప్రత్యేకంగా ఆయనను ఏదీ అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఏది ఇస్తే అది మనకు మహద్భాగ్యమని భావించాలి. ఇదే నిజమైన ప్రార్థన.

News September 20, 2025

MBNR: ఆదివారం రామకొండ జాతర

image

మహబూబ్‌నగర్ జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకొండపై స్వయంభువుగా వెలసిన శ్రీరాముడి జాతర ఆదివారం జరగనుంది. సంవత్సరంలో అరుదుగా వచ్చే ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నారు. ఈ కొండపై లభించే ఏ వనమూలికలైనా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు.

News September 20, 2025

కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

image

కొత్తగూడెంలోని సింగరేణి సంస్థ ప్రధాన ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. 65 ఏళ్ల ఓ మహిళ శరీరం నుంచి 8kgల కాంప్లెక్స్ ఒవేరియన్ ట్యూమర్ తొలగించారు. సింగరేణి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందం కంబైన్డ్ స్పెషల్ ఎపిడ్యూరల్ అనస్తీషియా కింద నిర్వహించారు. వైద్య సిబ్బందిని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ అభినందించారు.