News October 24, 2025
MDK: బంగారంపై చిగురిస్తున్న ఆశలు..!

కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరిగి ఆకాశాన్ని అంటాయి. రెండు రోజుల క్రితం బంగారం ధర రూ.1,33,000 ఉండగా ప్రస్తుతం ఒక్క రోజే రూ.5 వేలు తగ్గింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బంగారంపై ఆసక్తి చూపుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో ఆడపిల్ల పెళ్లి చేసే తల్లిదండ్రులు బంగారం ధర తగ్గాలని ఎదురుచూస్తుండగా రూ.5 వేలు తగ్గడంతో కొంత వరకైనా మేలని అంటున్నారు.
Similar News
News October 24, 2025
HYD: సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం ₹12.65 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకుంది. హైదరాబాద్‌లో ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరిట వందల మందిని సాహితీ ఇన్ఫ్రా సంస్థ మోసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. డైరెక్టర్ పూర్ణచందరరావు, కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. మొత్తం ₹126 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ విచారణలో తేలింది.
News October 24, 2025
కనీసం వెయ్యి మందితో యూనిట్ మార్చ్ నిర్వహించాలి: కలెక్టర్

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో భాగంగా ‘యూనిటీ మార్చ్ ఆఫ్ మోడర్న్ ఇండియా’ పోస్టర్లను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. యువతలో దేశభక్తి, సమైక్యత భావాలను పెంపొందించేలా అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 6 వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కనీసం వెయ్యి మంది యువకులతో యూనిటీ మార్చ్ పాదయాత్రను ఘనంగా చేపట్టాలన్నారు.
News October 24, 2025
నింగిలోకి ఎగిరిన తొలి స్వదేశీ ట్రైనర్ ఫ్లైట్

స్వదేశీ సాంకేతికతతో డెవలప్ చేసిన భారత తొలి ట్రైనర్ ఫ్లైట్ నింగిలోకి ఎగిరింది. బెంగళూరులో తయారు చేసిన హిందుస్థాన్ టర్బో ట్రైనర్-40(HTT-40) అందుబాటులోకి వచ్చినట్లు HAL వెల్లడించింది. దీని ద్వారా నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ వారియర్స్ శిక్షణ పొందుతారంది. ముందు ఒకరు, వెనుక మరొకరు కూర్చునేలా డిజైన్ చేసింది. బేసిక్ ఫ్లైట్ ట్రైనింగ్, వైమానిక విన్యాసాలు, నైట్ ఫ్లైయింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉపయోగపడనుంది.


