News February 13, 2025
MDK: బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి 3ఏళ్ల జైలు

కోహిర్ మండలంలో 2021 ఫిబ్రవరిలో 17ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు బేగరి ఆంజనేయులకు పోక్సో కోర్టు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. పోక్సో జడ్జి కే.జయంతి నిందితుడిని దోషిగా తేల్చారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన పలువురిని ఎస్పీ అభినందించారు.
Similar News
News April 22, 2025
మెదక్: ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలదే హవా.!

మెదక్ జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో విద్యార్థులు 49.21% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6,153 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3,028 పాస్ అయ్యారు. 3125 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో బాలుర ఉత్తీర్ణత శాతం 39.09 % కాగా, బాలికలు 57.05 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు పైచేయి సాధించడంతో జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
News April 22, 2025
రేగోడ్ పీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్

రేగోడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వైద్య ఆరోగ్య సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. ఆరోగ్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.
News April 22, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాల STATE ర్యాంకులు ఇవే..!

☞ఫస్ట్ ఇయర్ (స్టేట్)
సంగారెడ్డి – 60.20 శాతంతో 13వ ర్యాంక్
సిద్దిపేట – 51.50 శాతంతో 29వ ర్యాంక్
మెదక్- 49.24 శాతంతో 31వ ర్యాంక్
☞సెకండ్ ఇయర్‌లో ..
సంగారెడ్డి – 69.26 శాతంతో 16వ ర్యాంక్
మెదక్ – 61.52 శాతంతో 30వ ర్యాంక్
సిద్దిపేట – 59.56 శాతంతో 31వ ర్యాంక్