News September 26, 2024
MDK: బీఆర్ఎస్ పాలనలో సువర్ణ అధ్యాయం: హరీశ్‌రావు

తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని హరీశ్ రావు అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి అని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని, పత్తి ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందన్నారు. పంటల సాగులో తెలంగాణ మేటి అని అన్నారు. దేశానికే మన తెలంగాణ ఆదర్శమని చెప్పారు. ఇదంతా మంత్రమేస్తేనో, మాయ చేస్తేనో జరిగింది కాదని ఎక్స్ వేదికగా తెలిపారు.
Similar News
News February 28, 2026
మెదక్: ఇన్‌ఛార్జ్ మంత్రిని కలిసిన కలెక్టర్!

మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజుల క్రితమే కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ప్రభుత్వంపై నమ్మకం వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని కలెక్టర్ తెలిపారు.
News February 28, 2026
మెదక్: రాష్ట్ర స్థాయి ‘MUN’ పోటీలకు 11 మంది ఎంపిక!

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) పోటీల్లో ప్రతిభ చాటిన 11 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 56 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలకు ఎంఈవో శంకర్, హెచ్‌ఎంలు శ్రీనివాస్ రెడ్డి తదితరులు జడ్జిలుగా వ్యవహరించారు. విజేతలను డీఈవో విజయ, ఏఎంవో సుదర్శన్ మూర్తి అభినందించారు.
News February 28, 2026
మనోహరాబాద్: లింగారెడ్డిపేటలో చిరుత కలకలం!

లింగారెడ్డిపేట గ్రామ శివారులో చిరుత దాడిలో రెండు దూడలు మృత్యువాత పడ్డాయి. రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్యకు చెందిన పశువులపై చిరుత దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పాదముద్రల ఆధారంగా ఆనవాళ్లను సేకరించారు.


