News April 15, 2024

MDK: బీజేపీతో రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యాడు: హరీశ్ రావు

image

CM రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు బీజేపీ‌తో ములాఖత్ అయ్యాడని సిద్దిపేట MLA హరీశ్ రావు స్పష్టం చేశారు. జహీరాబాద్‌లో జరిగిన కార్యకర్తల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీని గెలిపించేందుకు కొన్ని స్థానాల్లో డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని ఆయన అన్నారు. ఇందులో MLA మాణిక్ రావు, BRS పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.

Similar News

News September 10, 2025

కళా నైపుణ్యాలను వెలికితీయడానికే కళా ఉత్సవ్​: డీఈవో

image

విద్యార్థుల్లో దాగి ఉన్న కళానైపుణ్యతను వెలికితీయడానికే ఉద్దేశంతోనే కళా ఉత్సవ్​ పోటీలను నిర్వహిస్తున్నట్లు​ జిల్లా విద్యాధికారి (డీఈవో) ప్రొఫెసర్​ రాధాకిషన్​ అన్నారు. బుధవారం మెదక్​ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కళా ఉత్సవ్​ ప్రారంభించారు. డీఈవో​ మాట్లాడుతూ.. విద్యార్థులలో కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు కళా ఉత్సవ్ పోటీలు ఉపయోగ పడతాయని పేర్కొన్నారు.

News September 10, 2025

తూప్రాన్: ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్

image

తూప్రాన్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. మనోహరాబాద్ మండల పర్యటనకు విచ్చేసిన కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించి, రోగులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూపరింటెండెంట్ అమర్ సింగ్‌కు సూచించారు.

News September 10, 2025

మెదక్: అగ్రిసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్

image

ప్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్య విద్యాలయం నిర్వహించిన 2025-26 అగ్రిసెట్ ఫలితాలలో పెద్ద శంకరంపేటకు చెందిన ప్రజ్ఞ శ్రీ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించింది. మంగళవారం బీఎస్సీ అగ్రికల్చర్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ వచ్చిందని ప్రజ్ఞ పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే ఈ ర్యాంకు సాధించినట్లు ఆనందం వ్యక్తం చేసింది.