News October 5, 2025
MDK: బైక్ దొంగకు నిప్పు.. ఒకరి పరిస్థితి విషమం

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో బైక్ దొంగిలిస్తున్న యేవాన్, మహిపాల్‌లను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఆగ్రహంతో వారి జేబులోని పెట్రోల్‌తో ఒకరిపై నిప్పంటించారు. మంటలు ఆర్పిన పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యేవాన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, మరొ దొంగ మహిపాల్‌పై ఇది వరకు పోక్సో కేసు ఉందని పోలీసులు తెలిపారు.
Similar News
News October 4, 2025
MDK: ఎన్నికల దృష్ట్యా ప్రజావాణి రద్దు: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నమైనందున, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంటూ, ప్రజలు గమనించాలని సూచించారు.
News October 4, 2025
నిజాంపేట: లక్కీ డ్రాలో తులం బంగారం

నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ శ్రీ భద్రకాళి ఉత్సవ కమిటీ మీదిగడ్డ వారి 4వ వార్షికోత్సవంలో భాగంగా కమిటీ సభ్యులు లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. ఈ లక్కీ డ్రాలో మొదటి బహుమతి నందిగామకు చెందిన టంకరి నవీన్ తులం బంగారం గెలుచుకున్నాడు. రెండో బహుమతి అమ్మవారి లడ్డును కాకి ప్రదీప్ కుమార్ గెలుచుకోగా, మూడో బహుమతి నాలాం విజయ్ అమ్మవారి పట్టుచీరను గెలుచుకున్నాడు. కమిటీ సభ్యులు వారికి సన్మానించి బహుమతులను అందించారు.
News October 4, 2025
మెదక్: భవనం పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశిస్తూ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. అనుకున్న సమయం కంటే ముందే భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.