News January 3, 2026
MDK: భారీగా పొగమంచు.. బయటకు రాకండి..!

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం వేళ రహదారులపై దృశ్యమానత తీవ్రంగా తగ్గడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించే ద్విచక్ర వాహనాలు, కార్లు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా వేగ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని, పొగమంచు తగ్గాక వస్తే బెటర్ అని అటవీ, ట్రాఫిక్ అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News January 3, 2026
ఏపీపీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం

ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ టెస్టులను ఈ నెల 5, 7, 10 తేదీల్లో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో టి.సీతారామమూర్తి తెలిపారు. శనివారం రాజమండ్రిలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐవోఎన్ డిజిటల్ జోన్, రాజీవ్ గాంధీ విద్యా సంస్థల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
News January 3, 2026
దువ్వాడ అడుగు ఎటువైపు ?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ ప్రయాణంపై శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బలమైన సామాజిక వర్గం నుంచి పాలిటిక్స్‌లోకి ఆయన వచ్చారు. ఏడాది క్రితం ఆయన వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురికాగా.. పలు ఇంటర్వ్యూల్లో ఇది తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. జిల్లాలో మారుతున్న పొలిటికల్ సమీకరణాల దృష్ట్యా BJPలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై దువ్వాడ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
News January 3, 2026
మితిమీరిపోతున్న ‘గ్రోక్ బికినీ’ ట్రెండ్..!

కేంద్రం సీరియస్ అయినప్పటికీ Xలో ‘గ్రోక్ బికినీ’ <<18744769>>ట్రెండ్<<>> ఆగలేదు. గతంలో కంటే ఇంకా ఎక్కువ అసభ్యతను యూజర్లు కోరుతూ శునకానందం పొందుతున్నారు. న్యూడిటీని ఇంకా పెంచాలని, లెగ్స్‌ని స్ప్రెడ్ చేయాలని ‘గ్రోక్’ని ఆదేశిస్తూ మితిమీరిపోతున్నారు. వీటిని కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సభ్యసమాజం చూస్తుందనే భయం లేకుండా ఇలాంటి ట్వీట్స్ చేసిన వారిని శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది.


