News August 10, 2025
MDK: మరో అడుగు నీరొస్తే పోచారం ప్రాజెక్టు ఓవర్ ఫ్లో!

మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కావడానికి మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం ఉదయం 19.4 అడుగుల మట్టానికి నీరు చేరుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. ప్రాజెక్ట్ నిండడంతో పర్యాటకుల తాకిడి మొదలైంది.
Similar News
News August 10, 2025
మెదక్ జిల్లాలో దంచి కొట్టిన వర్షం..

మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రామాయంపేటలో అత్యధికంగా 91 మిమీ, అత్యల్పంగా రేగోడ్ 1.0 మిమీ వర్షపాతం నమోదైంది. అటు మనోహరాబాద్ 90.6, పెద్ద శంకరంపేట 83.8, నర్సాపూర్ 73, కౌడిపల్లి 63.8, వెల్దుర్తి 63.3, చిలిప్ చెడ్ 60.8, చేగుంట 59.8, పాపన్నపేట్ 57.3, టేక్మాల్ 55, చిన్న శంకరంపేట 53.6 మిమీ వర్షపాతం రికార్డు అయ్యింది.
News August 10, 2025
మెదక్: 11 నుంచి నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

11 నుంచి 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల వారికి నులిపురుగుల నివారణ మాత్రలు అందిస్తామని మంత్రి దామోదర్ తెలిపారు. రేగోడ్‌లో రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కళాశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. చిన్నారుల పేగుల్లో ఉండే నులిపురుగులను నిర్మూలించి, రక్తహీనత తగ్గించి, రోగనిరోధక శక్తి పెంపొందించడంలో ఈ మాత్రలు సహకరిస్తాయని తెలిపారు.
News August 10, 2025
మెదక్: ‘రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి’

ఈనెల 13 వరకు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాపాసు పుస్తకం, ఆధార్ కార్డు, నామిని పేరుతో మండల వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కొత్తగా పాసు పుస్తకాలు పొంది 18-59 ఏళ్ల వయసు గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీమాపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.