News March 3, 2025
MDK: మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..!

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.1983లో శాలివాహన గ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.
Similar News
News September 13, 2025
రాష్ట్ర కళా ఉత్సవ్‌కు మెదక్ జిల్లా విద్యార్థులు ఎంపిక

రాష్ట్ర స్థాయిలో జరిగే కళా ఉత్సవ్-2025 పోటీలకు మెదక్ జిల్లా నుంచి పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని డీఈఓ రాధా కిషన్ తెలిపారు. వ్యక్తిగత విభాగంలో ఎస్. కౌడిపల్లి, బాలాజీ, శ్రీహర్షిని, ఆర్తిచంద్ర, సాత్విక్ ఎంపిక కాగా, బృందంలో స్పందన, మహేష్, కావేరి, సుర్తిత్రిక, పవన్ ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. వీరిని డీఈఓ , పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
News September 12, 2025
పెద్ద శంకరంపేట : మనస్థాపంతో బావిలో దూకి యువకుడి మృతి

పెద్ద శంకరంపేట మండలంలోని ముసపేటకి చెందిన గంగమేశ్వర్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిఅతడు తిరిగి రాలేదు. గంగమేశ్వర్ ఇటీవల ఓ కేసులో జైలుకు వెళ్ళి పది రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మనస్థాపంతోనే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 12, 2025
ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన మెదక్ మున్సిపాలిటీలోని గోల్కొండ వీధి, గాంధీనగర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలను రక్షించడానికి శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు.