News November 23, 2024
MDK: మహరాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మలేదు: హరీశ్‌రావు

మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని, ఇక్కడ మహిళలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామనడం.. రైతు భరోసా ఎగ్గొట్టడం.. ఆసరా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో ప్రభావం చూపాయన్నారు.
Similar News
News September 15, 2025
మెదక్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌గా కృష్ణమూర్తి బాధ్యతలు

మెదక్ జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) ఇన్‌స్పెక్టర్‌గా ఎం. కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు బాధ్యతలుగా టాస్క్ ఫోర్స్ ఇన్‌ఛార్జ్‌గా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
News September 14, 2025
మెదక్: లోక్ అదాలత్‌లో 2,446 పోలీస్ కేసుల పరిష్కారం: ఎస్పీ

జిల్లాలో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 2,446 పోలీసు కేసులు రాజీ కుదిరినట్లు జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాసరావు తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు లోక్ అదాలత్‌లో 106 సైబర్ క్రైమ్ కేసులలో రూ. 24,19,680 బాధితుల ఖాతాల్లో జమ చేయడానికి బ్యాంకు నోడల్ అధికారులకు ఆర్డర్ కాపీలు పంపించడం జరిగినట్లు వివరించారు.
News September 13, 2025
మెదక్: లోక్ ఆదాలత్‌లో 4,987 కేసుల పరిష్కారం: ప్రధాన న్యాయమూర్తి

జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 4,987 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ తెలిపారు. మెదక్, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో ఏర్పాటు చేసిన ఏడు బెంచ్‌ల ద్వారా ఈ కేసులను పరిష్కరించారని, వీటి విలువ రూ.1,04,88,964 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శుభవల్లి, ప్రిన్సిపల్ జడ్జిలు సిరి సౌజన్య, సాయి ప్రభాకర్ పాల్గొన్నారు.