News August 27, 2025
MDK: మూడు నెలల్లోనే కొత్త బ్రిడ్జి మునక

జాతీయ రహదారి విస్తరణలో హవేలీ ఘనపూర్ దాటినా తరువాత నాగపూర్ గేట్ వద్ద ప్రమాదకర మలుపును స్ట్రైట్ గా తీర్చిదిద్దారు. నక్క వాగు సమీపంలో బ్రిడ్జి నిర్మాణం కోసం ఇంజినీర్ ప్లాన్ వేశారు. రోడ్డు వేసిన రెండు, మూడు నేలల్లోనే కొత్త రోడ్డు నీట మునిగి రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రవాహంలో కారు కొట్టుకుపోగా ఓ యువకుడిని 4 గంటల తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.
Similar News
News August 27, 2025
మెదక్: భారీ వర్షాలు.. రైళ్లు రద్దు

భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. కాచిగూడ- కరీంనగర్ రైలు బిక్నూరు- కరీంనగర్ మధ్య, నాందేడ్-మేడ్చల్ వెళ్లే రైలు కామారెడ్డి- మేడ్చల్ మధ్య, విశాఖ- నాందేడ్ రైలు ఆకంపేట- నాందేడ్ మధ్యలో క్యాన్సిల్ చేయగా, కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్లే రైళ్లు పలు ప్రాంతాలకు డైవర్షన్ చేసినట్లు షెడ్యూల్ విడుదల చేశారు. కాచిగూడ- మెదక్, నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.
News August 27, 2025
వినాయక చవితి.. మెదక్ ఎస్స్పీ కీలక సూచనలు

గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే మండపాలను ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద మహిళలు, యువతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవ్ టీజింగ్‌ను అరికట్టాలని సూచించారు.
News August 27, 2025
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: మెదక్ ఎస్పీ హెచ్చరిక

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో యాంటీ-ర్యాగింగ్, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని, విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసే అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థికి సైబర్ నేరాలపై అవగాహన ఉండాలన్నారు.