News September 26, 2025
MDK: ‘మూడు రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి’

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆయన సూచించారు. జిల్లా పోలీస్ శాఖ 24 గంటలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Similar News
News October 24, 2025
మెదక్: సర్పంచులు లేక మరుగునపడుతున్న గ్రామాలు!

మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు సర్పంచులు లేక పూర్తిగా మరుగున పడిపోతున్నాయి. గ్రామంలో చిన్న సమస్యను చెప్పడానికి గ్రామానికి పెద్ద దిక్కు లేకపోవడంతో ప్రజలు అయోమయంలో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే.. అయిన గ్రామ అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తే కోర్టులు ఎన్నికలను నిలిపివేశాయి. గ్రామాల్లో నియమించిన స్పెషల్ ఆఫీసర్లు కంటికి కనిపించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
News October 24, 2025
మెదక్ జిల్లాలో 1420 మద్యం దరఖాస్తులు

మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాల కోసం 1420 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా పోతంశెట్టిపల్లి దుకాణానికి 54 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం సమయం పొడిగించడంతో 33 దరఖాస్తులు పెరిగాయి. మెదక్ సర్కిల్లో 17 దుకాణాలకు 513, నర్సాపూర్ సర్కిల్లో 17 దుకాణాలకు 519, రామాయంపేట సర్కిల్లో 15 దుకాణాలకు 388 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి రూ.42.60 కోట్ల ఆదాయం చేకూరింది.
News October 24, 2025
మెదక్: పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 లోపు స్కూల్ HMలకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. HMలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14లోపు ఫీజు చెల్లించాలన్నారు. విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు డీఈవోలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


