News December 21, 2025

MDK: మూడేళ్ల కొడుకును హత్య చేసిన కసాయి తండ్రి

image

తనకు పుట్టలేదని అనుమానంతో కుమారుడిని చంపిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ మండలం పెద్దబ్బాయి తండాకు చెందిన భాస్కర్‌కు అదే మండలానికి చెందిన ఒక మహిళతో 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. భాస్కర్ కొట్టాడని కొడుకుని అతని వద్ద వదిలి భార్య పుట్టింటికి వెళ్ళింది. దీంతో కొడుకును హత్య చేసిన భాస్కర్ పరారీలో ఉన్నట్టు తెలిపారు.

Similar News

News January 3, 2026

ఏపీపీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం

image

ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ టెస్టులను ఈ నెల 5, 7, 10 తేదీల్లో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో టి.సీతారామమూర్తి తెలిపారు. శనివారం రాజమండ్రిలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐవోఎన్ డిజిటల్ జోన్, రాజీవ్ గాంధీ విద్యా సంస్థల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

News January 3, 2026

దువ్వాడ అడుగు ఎటువైపు ?

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ ప్రయాణంపై శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బలమైన సామాజిక వర్గం నుంచి పాలిటిక్స్‌లోకి ఆయన వచ్చారు. ఏడాది క్రితం ఆయన వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురికాగా.. పలు ఇంటర్వ్యూల్లో ఇది తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. జిల్లాలో మారుతున్న పొలిటికల్ సమీకరణాల దృష్ట్యా BJPలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై దువ్వాడ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News January 3, 2026

మితిమీరిపోతున్న ‘గ్రోక్ బికినీ’ ట్రెండ్..!

image

కేంద్రం సీరియస్ అయినప్పటికీ Xలో ‘గ్రోక్ బికినీ’ <<18744769>>ట్రెండ్<<>> ఆగలేదు. గతంలో కంటే ఇంకా ఎక్కువ అసభ్యతను యూజర్లు కోరుతూ శునకానందం పొందుతున్నారు. న్యూడిటీని ఇంకా పెంచాలని, లెగ్స్‌ని స్ప్రెడ్ చేయాలని ‘గ్రోక్’ని ఆదేశిస్తూ మితిమీరిపోతున్నారు. వీటిని కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సభ్యసమాజం చూస్తుందనే భయం లేకుండా ఇలాంటి ట్వీట్స్ చేసిన వారిని శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది.