News February 1, 2025

MDK: యువతితో అసభ్య ప్రవర్తన.. మూడేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన చంద్రలింగం అదే గ్రామానికి చెందిన అమ్మాయిని చేతి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై కేసు నమోదైనట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.21 వేల జరిమానా విధించినట్లు చెప్పారు. కేసు పూర్తిగా విచారణ చేసి మెదక్ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News February 1, 2025

నరసాపురం: కాలువలో మృతదేహం

image

వేటాడేందుకు వెళ్లిన మత్స్యకారుడు కాలువలో పడి మృతి చెందిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామం ముస్కెపాలెంకు చెందిన కొపనాతి లక్ష్మణ్(57) శుక్రవారం వేటాడేందుకు కాలువలోకి వెళ్లాడు. ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల గాలించినా లక్ష్మణ్ జాడ తెలియలేదు. శనివారం వేములదీవి కాలువలో శవమై కనిపించాడు. 

News February 1, 2025

జగిత్యాల: విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

image

ధర్మపురి మైనారిటీ కాలేజీలో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుట పడిన తరువాత జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అబ్జర్వేషన్ అనంతరం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

News February 1, 2025

తిరుపతి జిల్లాలో 59.7 శాతం పెన్షన్ల పంపిణీ 

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కలిపి ఉదయం 9.40 గంటలకు అధికారులు తెలిపిన వివరాల మేరకు 59.7 శాతం పంపిణీ పూర్తి అయినట్లు వెల్లడించారు. తొలి స్థానంలో 79.24 శాతంతో తిరుపతి మున్సిపాలిటీ ఉంది. చివరి స్థానంలో 46.13 శాతంతో కోట ఉందని అధికారులు తెలిపారు.