News February 1, 2025

MDK: యువతితో అసభ్య ప్రవర్తన.. మూడేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన చంద్రలింగం అదే గ్రామానికి చెందిన అమ్మాయిని చేతి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై కేసు నమోదైనట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.21 వేల జరిమానా విధించినట్లు చెప్పారు. కేసు పూర్తిగా విచారణ చేసి మెదక్ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News March 5, 2025

ఇతర దేశాల్లో విదేశీయులకు ట్యాక్సుల్లేవా.. నిజమేంటంటే!

image

దేశీయ స్టాక్‌మార్కెట్ల నుంచి FII, FPIలు వెళ్లిపోవడానికి పెంచిన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, STTలే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. PM మోదీ, FM నిర్మలపై మీమ్స్ షేర్ చేస్తున్నారు. ప్రపంచంలో మరెక్కడా మన స్థాయిలో లేవని విమర్శిస్తున్నారు. వారు చెప్తోందని తప్పని PWC డేటా చెబుతోంది. మనతో పోలిస్తే బ్రెజిల్, మెక్సికో, సౌదీ, ఉజ్బెక్ సహా కొన్ని దేశాల్లో విదేశీయులు 20-35% మేర LTCG, STCG చెల్లించాల్సి ఉంటుంది.

News March 5, 2025

సంగారెడ్డి: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ అధికారి గోవిందురాం పాల్గొన్నారు.

News March 5, 2025

నిజామాబాద్: ఎమ్మెల్సీ కౌంటింగ్.. 23 మంది ఎలిమినేట్

image

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అధికారులు చేయనున్నారు. లెక్కింపునకు ముందు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికి 23 స్వతంత్ర అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అని అధికారులు తెలిపారు.

error: Content is protected !!