News September 24, 2025

MDK: రా’జీవం’ లేని యువ వికాసం

image

రాజీవ్ యువ వికాస పథకం నేటికి అమలుకు నోచుకోలేదు. ఆశావహులు దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నా పురోగతి లేదు. ఇప్పుడిస్తాం.. అప్పడిస్తామంటూ ఆశ పెట్టి తమను ఆగం చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. పైగా నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రచారం. ఈ లోగా రుణాలిచ్చి ఉపాధికి మార్గం చూపాలని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 32,638 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Similar News

News September 24, 2025

HYD: 8 మందిని అరెస్ట్ చేసిన తెలంగాణ సీఐడీ

image

బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ CID కీలక ఆపరేషన్ నిర్వహించింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 8 మందిని అరెస్ట్ చేసింది. వీరంతా 6 బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తాజా 007, ఫెయిర్ ప్లే లైవ్, ఆంధ్ర 365 బెట్టింగ్, వీఎల్ బుక్, తెలుగు 365, యస్ 365 యాప్‌లను ఈ ముఠా నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.

NGKL: జిల్లా కేంద్రంలో 26న ఉద్యోగమేళా

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐటిఐ కళాశాలలో ఈనెల 26న ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్ సింగ్ బుధవారం తెలిపారు. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా దాదాపు 50 ఉద్యోగాల భర్తీకి ఉద్యోగం మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులు ఉదయం 10:30 సర్టిఫికెట్లతో హాజరుకావాలని, 25 నుంచి 32 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు.