News March 25, 2025

MDK: రాష్ట్రంలో మహిళ‌ల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌కం: హ‌రీశ్‌‌రావు

image

సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలులో ఆదివారం యువతిపై జరిగిన అత్యాచారయత్నం ఘటన తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానిలో ఇలాంటి దారుణాలు జరుగుతుంటే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నట్లు? అని ప్ర‌శ్నించారు. ఆ కీచకుడి నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు.

Similar News

News November 10, 2025

మార్కెట్‌కు సెలవు: పెను ప్రమాదమే తప్పింది!

image

ఢిల్లీలో జరిగిన భారీ పేలుడులో పెను ప్రమాదమే తప్పింది. బ్లాస్ట్ జరిగిన ఎర్రకోట మెట్రో సమీపంలోని చాందినీ చౌక్‌లో ఓల్డ్ లజపత్ రాయ్ మార్కెట్ ఉంటుంది. సహజంగా ఆ మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుంది. అయితే సోమవారం దానికి సెలవు కావడంతో ఆ ప్రాంతంలో జన సాంద్రత కాస్త తక్కువగా ఉంది. లేదంటే మృతుల సంఖ్య భారీగా నమోదయ్యేది. మార్కెట్‌ను రేపు కూడా మూసేస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజయ్ భార్గవ్ ప్రకటించారు.

News November 10, 2025

సంగారెడ్డి: మంత్రుల వీడియో కాన్ఫరెన్స్

image

రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్‌లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు. పత్తి కొనుగోలు ఎకరాకు 7 క్వింటాల నుంచి 12 క్వింటాలకు కొనుగోలు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రులు తెలిపారు. కలెక్టర్లు ధాన్యం కొనుగోలను దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు.

News November 10, 2025

ఆదిలాబాద్: సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఎస్పీ

image

ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల రోజును ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎస్పీని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు.