News March 19, 2024
MDK: రూ. 50 వేలకు మించితే సీజ్..!

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు విస్తృతంగా సాగుతున్నాయి. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసు, ఇతర శాఖలు సమన్వయంగా తనిఖీలు చేస్తున్నాయి. ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. రూ.50 వేలకు మించితే నగదు సీజ్ చేస్తున్నారు. ఎన్నికలకు అనుబంధంగా ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వేలెన్సు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇతరత్రా బృందాలు సోదాలు చేస్తున్నారు.
Similar News
News September 3, 2025
ప్రభుత్వ ఉద్యోగులు క్రీడా పోటీలకు దరఖాస్తు చేసుకోండి: డివైఎస్ఓ

క్రీడల పట్ల ఆసక్తి ఉన్న మెదక్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు క్రీడా పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్ఓ రాధాకిషన్ తెలిపారు. ఈ నెల 6న దరఖాస్తు చేసుకోవాలని, పర్మనెంట్ ఉద్యోగులు మాత్రమే అర్హులని చెప్పారు. ఉద్యోగులు తమ సర్వీస్ సర్టిఫికేట్, తాజా ఐడీ కార్డుతో తమ పేర్లను జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.
News September 3, 2025
టేక్మాల్: గణపతి లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకుడు

టేక్మాల్‌లో గణపతి లడ్డూను ముస్లిం యువకుడు మతీన్ దక్కించుకున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం టేక్మాల్‌లోని నాగులమ్మ ఆలయం వద్ద గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి లడ్డూకు నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంలో గ్రామానికి చెందిన మతీన్ రూ. 21 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. నిర్వాహకులు అతనికి ఈ ఘటన మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది.
News September 3, 2025
మెదక్ జిల్లాలో 5,23,327 మంది ఓటర్లు

తుది ఓటరు జాబితా ప్రకారం మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులు ఉన్నాయి. మొత్తం 5,23,327 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 2,51,532 మంది, మహిళలు 2,71,787 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. వార్డుకు ఒకటి చొప్పున మొత్తం 4,220 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తులో అధికారులు నిమగ్నమయ్యారు.