News December 12, 2025

MDK: రేపే నవోదయ పరీక్ష.. మిస్ చేసుకోకండి

image

సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 ఏడాదికి గానూ 6వ తరగతిలో ప్రవేశాలకు శనివారం ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందుకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. హాల్ టికెట్ <>వెబ్ సైట్<<>> నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
-SHARE IT

Similar News

News December 12, 2025

నాకు ఆ విషయం తెలియదు: మంత్రి కోమటిరెడ్డి

image

సినిమా టికెట్ల ధరల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “టికెట్ల ధర పెంచబోమని అసెంబ్లీలో చెప్పాను.. ఇకపై రేట్లు పెంచే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. తనకు తెలియకుండానే తాజాగా జీవో విడుదలైందని, దీనిపై నిర్మాతలు, దర్శకులు ఎవరూ తన వద్దకు రావద్దని తేల్చి చెప్పారు. సామాన్య కుటుంబం సినిమా చూడాలంటే ధరలు తగ్గాల్సిందేనని, సామాన్యుడిపై భారం పడనివ్వబోమని మంత్రి ఉద్ఘాటించారు.

News December 12, 2025

ఘోరం.. బాలిక చెవి కొరుక్కుతిన్న కుక్క

image

AP: నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4 ఏళ్ల చిన్నారిపై వీధికుక్క పాశవికంగా దాడి చేసింది. ఆసియా అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసి చెవిని కొరుక్కుతింది. చెంపతో పాటు ఇతర శరీర భాగాలపైనా తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
* పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి

News December 12, 2025

రాజాపూర్: MLA అహంకారానికి హెచ్చరిక: ఎంపీ

image

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలుకావడం ఆయన అహంకారానికి ప్రజలు ఓటుద్వారా చేసిన హెచ్చరిక అని ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డిగూడెంలో సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన ఆనంద్ రేవతిని ఎంపీ అభినందిస్తూ, శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధికి భవిష్యత్తులో మరింత కృషిచేయాలని సూచించారు. తన పూర్తి సహకారం ఉంటుందని డీకే అరుణ హామీ ఇచ్చారు.