News February 9, 2025

MDK: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి

image

సిద్దిపేట జిల్లా చేగుంట, గజ్వేల్ రహదారిపై నర్సపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వేణు(48), శివమణి(15), విష్ణు ఒడి బియ్యం పోయించుకోడానికి భార్యను బస్సులో పంపి ఇద్దరు కూమారులతో బైక్‌పై వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో బైక్‌ను లారీ ఢీ కొట్టగా తండ్రి వేణు, కుమారుడు శివమణి అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News February 9, 2025

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే చెప్పండి: మెదక్ పోలీసులు

image

పై ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని మెదక్ జిల్లా పోలీసులు సూచించారు. మెదక్ మండల కేంద్రంలోని ఒకటో నంబర్ కల్లు దుకాణంలో మహిళను మభ్యపెట్టి ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకుని పరారైన దుండగుడి ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తిస్తే సంబంధిత పోలీస్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు.

News February 9, 2025

డ్రామాలో బుడాన్ ఖాన్ కేసీఆర్: ఎంపీ రఘునందన్

image

డ్రామాలో బుడాన్ ఖాన్ కథ లెక్క కేసీఆర్ తీరు ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మెదక్‌లో పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు. బీజేపీ బలపర్చిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులున్నారు.

News February 9, 2025

మాసాయిపేట: తల్లి మృతితో అనాథలైన పిల్లలు.. ఆదుకోండి

image

మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన వెంగలి అనిత(35) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. నాలుగేళ్లు క్రితం భర్త కర్ణ చనిపోవడంతో కుటుంబాన్ని ఆమె నెట్టుకొస్తుంది. తాజాగా అనిత మృతితో మానసిక దివ్యాంగులైన వారి ఇద్దరి పిల్లలు అనాథలుగా మిగిలారు. అంత్యక్రియలకు సైతం స్థోమత లేని స్థితిలో ఉన్నారని, దాతలు స్పందించి ఆ కుటంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

error: Content is protected !!