News March 27, 2024
MDK: విషాదం.. రైతు మృతి

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కొత్త కాపు నరేందర్ రెడ్డి(53) చింతచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. నిన్న సాయంత్రం చింతకాయలు తెంపేందుకు చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతిచెందగా.. కుటుంబీకులు రాత్రి గుర్తించారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 29, 2026
ఏడుపాయలలో కాటేజీలకు శశిధర్ రెడ్డి విజ్ఞప్తి

మెదక్ జిల్లా ఏడుపాయల క్షేత్రం అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. భక్తుల వసతి కోసం 12 కాటేజీల నిర్మాణానికి రూ. 7 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టూరిజం అధికారులను కోరారు. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన నిర్వహించారు. దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా పర్యాటక రంగాన్ని బలోపేతం చేయవచ్చని ఆయన అధికారులకు లేఖ రాశారు.
News March 29, 2026
మెదక్: జనగణనపై అదనపు కలెక్టర్ నగేష్ దిశానిర్దేశం

సమీకృత కలెక్టరేట్‌లో జనగణన-2027 ఫేస్-1(గృహ గణన) పై ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మెంచు నగేష్ మాట్లాడుతూ.. జనగణన నాణ్యత క్షేత్రస్థాయి కార్యకర్తలపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. గణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా సిబ్బందికి సమర్థవంతమైన శిక్షణ ఇవ్వాలని ఫీల్డ్ టీమ్‌లను ఆదేశించారు. డేటా సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News March 29, 2026
మెదక్: జిల్లా వ్యాప్తంగా 2583 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 2583 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టులలో, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


