News December 12, 2025
MDK: సర్పంచ్‌గా నాడు తల్లి.. నేడు తనయుడు

మెదక్ జిల్లా సరిహద్దులో గల హవేలి ఘనపూర్ మండలం పోచంరాల్‌లో సర్పంచ్‌గా లంబాడి రాజు విజయం సాధించారు. అయితే మొన్నటి వరకు రాజు తల్లి పేంలీ సర్పంచ్‌గా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సమీప ప్రత్యర్థి రూప్ సింగ్ పై 167 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. దీంతో గతంలో తల్లి, ఇప్పుడు తనయుడు సర్పంచ్‌గా పనిచేయనున్నారు.
Similar News
News December 14, 2025
సిద్దిపేట: వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఎన్నికల ఓటింగ్ పరిశీలన

జిల్లాలో నేడు 10 మండలాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. ఆయా ఎంపీడీఓలకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు వెబ్ కాస్టింగ్‌ను మానిటర్ చేయాలన్నారు.
News December 14, 2025
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

ఢిల్లీలోని <
News December 14, 2025
నల్గొండలో ప్రశాంతంగా పోలింగ్: ఎస్పీ

నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్
తెలిపారు. ఆయన జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా అంతటా 144 సెక్షన్ (163 బీఎన్ఎస్ఎస్) అమలులో ఉన్నట్లు స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


