News December 3, 2025

MDK: సర్పంచ్, వార్డు అభ్యర్థుల గుర్తులు ఎలా కేటాయిస్తారో తెలుసా..?

image

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ చేసుకోవచ్చు. గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న వారికి గుర్తుల కేటాయింపు ప్రారంభమవుతుంది. అయితే ఈసారి గుర్తుల కేటాయింపు తెలుగు అక్షర క్రమానుసారం జరుగుతుంది. నామినేషన్ పత్రంలో అభ్యర్థి పేరు ఎలా నమోదు అయిందో, ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తులను కేటాయిస్తారు.

Similar News

News December 3, 2025

ప్రసారభారతిలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

న్యూఢిల్లీలోని<> ప్రసారభారతి<<>>లో 29 కాంట్రాక్ట్ కాపీ ఎడిటర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ, పీజీ డిప్లొమా( జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లిష్/హిందీతో పాటు స్థానిక భాషపై పట్టుండాలి. వయసు 35ఏళ్ల లోపు ఉండాలి. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.35వేలు చెల్లిస్తారు.వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/

News December 3, 2025

రోడ్డు ప్రమాదంలో జమాండ్లపల్లి వాసి మృతి

image

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామానికి చెందిన పీరాల భగత్ (28) మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. రైల్వే శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న భగత్ విధులు ముగించుకొని బుధవారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో భగత్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News December 3, 2025

వరంగల్: మూడు రోజులుగా స్థిరంగానే పత్తి ధర

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మూడు రోజులుగా పత్తి ధర స్థిరంగా ఉంటోంది. సోమవారం, మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,100 పలకగా.. బుధవారం సైతం అదే ధర పలికినట్లు అధికారులు చెప్పారు. చలికాలం నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తూ పత్తిని మార్కెటు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.