News March 20, 2025
MDK: సీఎం రేవంత్, మంత్రిని కలిసి ఎస్సీ నేతలు

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మాదిగ, మాదిగ ఉప కులాల సంఘాల నాయకులు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదరను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దశాబ్దాల కల నెరవేరిందని షెడ్యూల్డ్ కులాల ప్రజలకు మంత్రి దామోదర రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతామని మంత్రి అన్నారు.
Similar News
News March 20, 2025
సంగారెడ్డి: చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యం

చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యమైన ఘటన సంగారెడ్డిలో జరిగింది. పట్టణ సీఐ రమేశ్ వివరాలు ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన విజయలక్ష్మి (54), కుమార్తె మణిదీపిక(25) అదృశ్యమైనట్లు ఈనెల 17న మెదక్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని వినాయక సాగర్ చెరువులో తల్లి, కూతుర్లు మృత దేహాలు లభ్యమయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 20, 2025
మెదక్: SSC పరీక్ష కేంద్రాల 163 BNSS సెక్షన్: SP

21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమి కూడొద్దని సూచించారు. పరీక్ష కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్‌లను మూసివేయాలని, జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News March 20, 2025
మెదక్: నో హెల్మెట్.. NO ENTRY: కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లోని అన్ని మండలాల ఎమ్మార్వోలతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆయా మండలాలలోని ఎమ్మార్వో కార్యాలయంలోకి వచ్చే ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని సూచించారు. అదే విధంగా అన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధించాలన్నారు.