News October 24, 2025
MDK: సీటెట్ నోటిఫికేషన్ విడుదల..!

సీ–టెట్ నోటిఫికేషన్ విడుదలైనట్లు సీబీఎస్ఈ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా సీ–టెట్ పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ctet.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 25, 2025
VZM: ఒకేచోట ఆధ్యాత్మికత.. పర్యాటకం

విజయనగరం మండలం సారిక గ్రామంలోని కాళీమాత దేవాలయం, రామబాణం ఆకారంలో ఉన్న రామనారాయణం దేవాలయం పక్కనే ఉండటంతో ఆధ్యాత్మిక సందర్శకుల కేంద్రంగా మారింది. కార్తీక మాసంలో భక్తులు ఒకేసారి రెండు పుణ్య క్షేత్రాలను దర్శించుకునే అరుదైన అవకాశం లభిస్తోంది. దీంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. భక్తులు కాళీమాత ఆశీస్సులు, శ్రీరామచంద్రుడి కృప ఒకే చోట పొందుతున్నారు.
News October 25, 2025
హైదరాబాద్‌లో వర్షపాతం ఇలా..!

గడచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం కురిసింది. ఈది బజార్ ప్రాంతంలో 6.8 మి.మీ, సర్దార్ మహల్ 5.5, రియాసత్‌నగర్ 3.8, రూప్‌లాల్ బజార్, డబీర్‌పుర 3.8, బహదూర్‌పుర, యాకుత్‌పుర 3.3, ఖలందర్‌నగర్ 6.5, గోల్కొండ 1.8, అసిఫ్‌నగర్ 3.0, జియాగూడ 1.3, బేగంబజార్, జుమ్మెరాత్ బజార్ 3.8, ముషీరాబాద్‌లో 2.0, హిమాయత్‌నగర్, అంబర్‌పేటలో 1.3 మి.మీల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ చిరుజల్లు కురిశాయి.