News October 5, 2025
MDK: ‘స్థానిక’ ఎన్నికలు.. అంతా గప్‌చుప్..!

ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా పార్టీల్లో ఎక్కడా చలనం కనిపించడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ కూడా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJPగ్రామ కమిటీ లేదా మండల మీటింగ్ నిర్వహించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టలేదు. 8న హైకోర్ట్ ఏ విధంగా స్పందిస్తుందోనని వేచి చూసే ధోరణిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. BCరిజర్వేషన్లపై ఏవిధంగా తీర్పు వస్తుందో అని నాయకులు, కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. దీనిపై మీ కామెంట్.
Similar News
News April 8, 2026
KNR: మానేరు రివర్ ఫ్రంట్ పై ఎంక్వైరీ ఉన్నట్టా? లేనట్టా?

KNRను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రూ.546 కోట్లతో చేపట్టిన మానేర్ రివర్ ఫ్రంట్ పనులు పూర్తికాకుండానే రూ.226 కోట్లు నిర్మాణ సంస్థకు చెల్లింపులు చేసినట్లు ప్రతిపక్షాలు సీఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొనగా, ఇప్పటివరకు విచారణ జరగలేదు. ఇటీవల మంత్రులు నిర్వహించిన సమావేశంలో MRFలో జరిగిన అవినీతి ఆరోపణలపై ఏం నిర్ణయం తీసుకున్నారన్నది సస్పెన్స్‌గా మారింది.
News April 8, 2026
ఇంటర్ రిజల్ట్స్ వార్తలు ఫేక్.. నమ్మొద్దన్న బోర్డు!

AP: ఇంటర్ ఫలితాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు ఖండించింది. ఏప్రిల్ 12న రిజల్ట్స్ విడుదలవుతాయనే వార్తలు పూర్తిగా అబద్ధమని బోర్డు కమిషనర్ రంజిత్ బాషా స్పష్టం చేశారు. ఫలితాల తేదీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, విద్యార్థులు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. రిజల్ట్స్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేస్తామని చెప్పారు.
News April 8, 2026
వైభవ్‌ను ఇక వెయిట్ చేయించొద్దు: ఇర్ఫాన్

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు. బుమ్రా వంటి దిగ్గజ బౌలర్‌ను ఫోర్లు, సిక్సర్లతో టెన్షన్ పెట్టడం ఈజీ కాదని కొనియాడారు. ‘వైభవ్‌ను ఇక వెయిట్ చేయించకుండా వెంటనే టీమ్ ఇండియాలోకి తీసుకోండి’ అని BCCI సెలక్టర్లను కోరారు. బుమ్రానే ఆలోచనలో పడేసిన ఈ కుర్రాడు మరో 20 ఏళ్ల పాటు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడగలడని, ఇది బౌలర్లకు హెచ్చరిక అని వ్యాఖ్యానించారు.


