News March 26, 2025

MDK: హామీలను అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదు: హరీశ్ రావు

image

కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం మెదక్‌లో మాట్లాడుతూ.. రుణమాఫీ చేసిందని ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని, రుణమాఫీ కాని రైతులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు.

Similar News

News March 29, 2025

సంగారెడ్డి: ముగ్గురు పిల్లలు మృతి.. భర్త అనుమానమే కారణమా?

image

SRD జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. RR జిల్లా తలకొండపల్లి(M)కి చెందిన చెన్నయ్య 2012లో NLG జిల్లా మందాపూర్‌ వాసి రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమెపై అనుమానంతో చెన్నయ్య వేధించేవాడు. దీంతో పట్టింటికి వెళ్లింది. పెద్దలు చెప్పడంతో భర్త దగ్గరికి వచ్చింది. మళ్లీ వేధిస్తే పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటానని అప్పట్లోనే రజిత హెచ్చరించినట్లు తెలిసింది.

News March 29, 2025

SRD: ముగ్గురు పిల్లలు మృతి.. ఇప్పుడే ఏం చెప్పలేం: SP

image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో <<15910567>>ముగ్గురు పిల్లలు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకజ్ మాట్లాడారు. ‘క్లూస్ టీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానికులను ఆరా తీశాం. ఈ ఘటనలో పూర్తి స్థాయిలో ఏం జరిగిందని తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే పిల్లలు ఎలా మృతి చెందారన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం..’ అని వివరాలు వెల్లడించారు.

News March 29, 2025

సంగారెడ్డి: ముగ్గురు పిల్లలు మృతి.. UPDATE

image

అమీన్‌పూర్‌లో <<15910567>>ముగ్గురు పిల్లలు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. RR జిల్లా తలకొండపల్లి(M)కి చెందిన చెన్నయ్య 2012లో NLG జిల్లా మందాపూర్‌ వాసి రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో వారంతా భోజనం చేశారు. అయితే రజిత, పిల్లలు పెరుగు, పప్పుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిన్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చూడగా పిల్లలు చనిపోయారు. రజితకు సీరియస్‌గా ఉందని ఆస్పత్రికి తరలించారు.

error: Content is protected !!