News November 15, 2024

MDK: 19న ఏడుపాయల నుంచి పాదయాత్ర !

image

ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై ఉద్యమించడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమవుతున్నాయి. ఈనెల 19వ తేదీన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా-లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి.. ఇతర నాయకులు, రైతులతో కలసి ఏడుపాయల నుంచి మెదక్ వరకు పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Similar News

News October 30, 2025

మెదక్: రైతులకి ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

image

ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రైతులకి ఇబ్బందులు కలగకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం హవేలి ఘనపూర్ మండలం శాలిపేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

News October 30, 2025

ఏసీబీకి పట్టుబడ్డ మెదక్ ట్రాన్స్కో డీఈ

image

మెదక్ ట్రాన్స్ కో డివిజనల్ ఇంజినీర్ షేక్ షరీఫ్ చాంద్ బాషా ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.21 వేల నగదు తీసుకుంటుండగా ఉమ్మడి మెదక్ జిల్లా డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పట్టుకున్నారు. ఓ పని విషయంలో నగదు తీసుకుంటూ పట్టు బడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులు రావడంతో మెదక్ ట్రాన్స్కో కార్యాలయంలో సిబ్బంది లేకుండా పోయారు.

News October 30, 2025

మెదక్: రేపు బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్

image

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ నెల 31న మెదక్‌లోని PNR స్టేడియంలో ‘ఓపెన్ టు ఆల్’, 40+ వయసు విభాగంలో బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌ ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు గురువారం సాయంత్రం 5 గంటలలోపు ఆర్ఎస్సై నరేష్ (87126 57954) వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.