News November 16, 2024
MDK: 19న ఏడుపాయల నుంచి పాదయాత్ర !
ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై ఉద్యమించడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమవుతున్నాయి. ఈనెల 19వ తేదీన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా-లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి.. ఇతర నాయకులు, రైతులతో కలిసి ఏడుపాయల నుంచి మెదక్ వరకు పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News December 27, 2024
సిద్దిపేట: స్పూర్తి ప్రధాత మన్మోహన్ సింగ్: మంత్రి పొన్నం
స్పూర్తి ప్రధాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మన్మోహన్ సింగ్ వివేకం, సమగ్రతకు ఆదర్శమని, ఆయన దార్శనిక నాయకత్వం.. భారతదేశ పురోగతి పట్ల తిరుగులేని నిబద్ధత, దేశంపై చెరగని ముద్ర వేసిందన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు.
News December 26, 2024
మాజీ ఎంపీ మందా జగన్నాథంను పరామర్శించిన హరీశ్‌రావు
నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు హరీశ్‌రావు. అనంతరం జగన్నాథం ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి హరీశ్‌రావు తెలుసుకున్నారు.
News December 26, 2024
మెదక్: ఎస్సై సూసైడ్.. ఏం జరిగిందంటే..
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి చెరువులో<<14983898>>SI సాయికుమార్<<>>తోపాటు కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు దొరికాయి. నిన్న మం. నుంచి SI ఫోన్ ఆఫ్ కాగా అధికారులు ఆరా తీశారు. ఉదయం డ్యూటీ నుంచి వెళ్లిన శ్రుతి ఇంటికి రాకపోవడంతో పేరెంట్స్ బీబీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా చెరువులో గాలింపు చేపట్టిన పోలీసులు అర్ధరాత్రి శ్రుతి, నిఖిల్ మృతదేహాలు, ఉదయం SI మృతదేహం గుర్తించారు.