News November 16, 2024
MDK: 19న ఏడుపాయల నుంచి పాదయాత్ర !
ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై ఉద్యమించడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమవుతున్నాయి. ఈనెల 19వ తేదీన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా-లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి.. ఇతర నాయకులు, రైతులతో కలిసి ఏడుపాయల నుంచి మెదక్ వరకు పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News December 14, 2024
మెదక్: నేడు మంత్రి కొండా సురేఖ పర్యటన
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో శనివారం రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నారు. మండల పరిధిలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్‌ను మంత్రి సందర్శిస్తారని అధికారులు తెలిపారు. అర్బన్ పార్క్‌లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు.
News December 13, 2024
మెదక్: శిథిలావస్థలోని ఇళ్ల వివరాలను సేకరించాలి: కలెక్టర్
చిన్నశంకరంపేట మండలం మాందాపూర్ గ్రామంలో కొన్నసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన పురాతన ఇళ్లలో నివాసముంటున్న వారు కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు వస్తే వారి వివరాలను సైతం యాప్‌లో పొందుపర్చాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే అత్యంత పారదర్శకంగా కొనసాగుతుందని ఆయన అన్నారు.
News December 13, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి పంజా
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా విపరీతమైన చలి పెరగడంతో జనం ఇంట్లోంచి బయటకు రావటానికి జంకుతున్నారు. వాహనదారులు, పాదచారులు చలికి ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మెదక్ జిల్లా దామరంచలో 11.9 డిగ్రీలు నమోదు కాగా.. కనిష్ఠంగా సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 10.1, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.