News November 15, 2024
MDK: 19న ఏడుపాయల నుంచి పాదయాత్ర !
ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై ఉద్యమించడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమవుతున్నాయి. ఈనెల 19వ తేదీన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా-లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి.. ఇతర నాయకులు, రైతులతో కలసి ఏడుపాయల నుంచి మెదక్ వరకు పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News December 3, 2024
మెదక్: ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి పొన్నం
ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బీసీ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేక సంస్కరణలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరోగ్యశ్రీని 5 లక్షలకు ఉన్న పరిమితి 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎంత ఖర్చైనా వెనకాడమన్నారు.
News December 2, 2024
అందోల్: అంబులెన్స్‌లు ప్రారంభించిన మంత్రి దామోదర్
హైదరాబాదులోని ఎన్టీఆర్ మార్గ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్కతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ అంబులెన్స్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్య సబ్ సెంటర్లు, PHC, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు రూ.500 కోట్ల విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే అని ఆయన అన్నారు. పేదవాని వైద్యం, విద్య మా బాధ్యతగా భావించేది కాంగ్రెస్ అని తెలిపారు.
News December 2, 2024
అందోల్: వైద్యం వ్యాపార పరం కావొద్దు: మంత్రి రాజనర్సింహ
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని మంత్రి రాజనర్సింహ అన్నారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న వేళ ఆరోగ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. వైద్యం వ్యాపార పరం కావొద్దని, ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు. ఎక్కడా మందుల కొరత లేకుండా చేశామని తెలిపారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.