News August 9, 2025

MDK: 19 అడుగుల నీటిమట్టానికి పోచారం ప్రాజెక్టు

image

మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు 19 అడుగుల నీటిమట్టానికి నీరు చేరుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. వర్షాలకు ప్రాజెక్ట్ నిండుకోవడంతో అన్నదాతలు సంతోషిస్తున్నారు. రాఖీ సెలవులు కావడంతో పర్యాటకులు వస్తున్నారు.

Similar News

News August 9, 2025

మెదక్: 12న హానికర కర్మాగారాల కమిటీ సభ్యుల సమావేశం

image

ఈనెల 12న మెదక్ కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్ అధ్యక్షతన జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని హానికర కర్మాగారాల కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు కర్మగారాల ఉపప్రధాన అధికారి లక్ష్మీ కుమారి తెలిపారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, మెదక్ జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ తదితరులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు.

News August 9, 2025

మెదక్: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

image

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) నవీన్ మిట్టల్, రెడ్ కో సీఎండీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ, సింగరేణి కాలరీస్ సీఎండీలతో కలిసి సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ పై మాట్లాడారు.

News August 9, 2025

మెదక్ జిల్లాలో వర్షపాతం అప్డేట్..!

image

మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నర్సాపూర్‌లోని చిప్పలతుర్తి 65.5, కాగజ్ మద్దుర్ 8.3, నర్సాపూర్ 34.8, చేగుంట 41.8, శివ్వంపేటలో కొత్తపేట 36.3, శివ్వంపేట 24.3, వెల్దుర్తి 34.8, రామాయంపేట 23.3, మెదక్ 22.3, మాసాయిపేట 19.5, మనోహరాబాద్ 18.5, అల్లాదుర్గ్ 4.0, టేక్మాల్ 3.3, కుల్చారం 0.8 మిమీ వర్షపాతం నమోదైంది.