News December 14, 2025
MDK: 2 ఓట్లతో స్వప్న విజయం

నిజాంపేట మండలం నందిగామలో బీజేపీ మద్దతుదారు షేరి స్వప్న 2 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. గ్రామంలో వారి మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుపోతామని వారు పేర్కొన్నారు. నమ్మకంతో గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 12, 2026
మెదక్: ఓటింగ్‌లో మహిళా చైతన్యం భేష్.. !

మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు మరోసారి ఓటింగ్‌లో సత్తా చాటారు. 4 మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా 80.76 శాతం ఓటింగ్ నమోదు చేసి చైతన్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 44,591 మంది మహిళా ఓటర్లలో 36,015 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని 4 ఛైర్మన్ స్థానాలు మహిళలకే రిజర్వ్ కావడంతో మహిళా ఓటర్ల ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో రేపటి ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News February 12, 2026
మెదక్ జిల్లాలో 4 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో గోల్డ్ బంగ్లా వెస్లీ కళాశాల, నర్సాపూర్‌లో BVRIT, తూప్రాన్‌లో నోబుల్ ఫార్మా కళాశాల, రామాయంపేటలో ఎంపీడీవో కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం నుండే ఈ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.
News February 12, 2026
MDK: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి నేడు OD

నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు ఓడీ సౌకర్యం కల్పిస్తున్నట్లు MDK జిల్లా విద్యాధికారి విజయ తెలిపారు. విధుల్లో ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, కౌంటింగ్ ట్రైనింగ్ ఉన్న సిబ్బంది మాత్రం తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలని సూచించారు. పాఠశాలల నిర్వహణకు ఆటంకం కలగకుండా హెచ్‌ఎంలు, ఎంఈఓలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.


