News March 30, 2025
MDK: ‘25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి’

ఎల్ఆర్ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నవారు పూర్తిస్థాయిలో రుసుము చెల్లించి ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 31లోపు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించిన వారికి ప్రభుత్వం 25% రాయితీని వర్తింపజేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News April 2, 2025
‘పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు కృషి చేయాలి’

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం ఐడిఓసిలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలకు అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
News April 2, 2025
తూప్రాన్: గుండ్రెడ్డిపల్లిలో ఒకరు ఆత్మహత్య

తూప్రాన్ మండలం గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అరకల శ్రీనివాస్(52) రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం తలుపులు తీయకపోవడంతో పక్కింటి వారు అనుమానం వచ్చి తలుపులు తొలగించి చూడగా ఉరివేసుకొని కనిపించాడు. భార్యా పిల్లలు హైదరాబాదులో ఉంటున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 2, 2025
మెదక్: వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

ఉమ్మడి MDK జిల్లావ్యాప్తంగా నిన్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. మనోహరాబాద్ మండలం కొండాపూర్ పారిశ్రామికవాడలోని శ్రీయాన్ పాలిమర్ పరిశ్రమలో MPకి చెందిన రఘునాథ్ సింగ్ అనే కార్మికుడు కరెంటు షాకుతో చనిపోయాడు. ఆర్సీపురం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీరంగూడ వాసి శిరీష(22) చికిత్స పొందుతూ మృతిచెందింది. MDKలో స్విమ్మింగ్పూల్లో మునిగి మహ్మద్ హఫీజ్(24)అనే యువకుడు చనిపోయాడు.