News September 12, 2024
MDK: 30 ఏళ్లుగా ఆ ఊరిలో ఒకే దేవుడు..!

వినాయక చవితి వచ్చిందంటే గల్లీగల్లీకి విగ్రహం పెట్టి, DJ చప్పుళ్లతో హంగామా చేయడం చూస్తుంటాం. కానీ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్లో మాత్రం డిఫరెంట్. ఇక్కడి ప్రజలు మాత్రం కుల, మతాలకు అతీతంగా 30 ఏళ్లుగా గ్రామంలో ఒకే గణపతిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా సంబరాలు చేసుకుంటున్నారు.
Similar News
News October 17, 2025
మెదక్: ‘తపాలా శాఖ ద్వారా ఓటర్లకు గుర్తింపు కార్డులు’

నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా మెదక్ జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ రాహుల్ రాజ్, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు. ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరికి తపాలా శాఖ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని తెలిపారు.
News October 17, 2025
నర్సాపూర్: ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ సస్పెండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించాలన్న సమాచారంతో విచారణ చేపట్టిన డీఈవో వారిని గురువారం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
News October 16, 2025
మెదక్: 49 మద్యం దుకాణాలు.. 276 దరఖాస్తులు

మెదక్ జిల్లాలోని మొత్తం 49 మద్యం దుకాణాలకు బుధవారం వరకు 276 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి జి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం దుకాణాలు ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిపారు. సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.