News April 21, 2025

MDK: 9,970 GOVT జాబ్స్.. GET READY

image

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281

Similar News

News April 21, 2025

సిట్ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి

image

AP: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన గోవా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. కాసేపట్లో విజయవాడకు తరలించనున్నారు. కాగా ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజ్ కసిరెడ్డి ఈ ఉదయం ఆడియో రిలీజ్ చేశారు.

News April 21, 2025

రేపు ఇంటర్‌ రిజల్ట్స్.. HYDలో వెయిటింగ్

image

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన హైదరాబాద్ జిల్లాలో 244 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 90,351 విద్యార్థులకు 87,523 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 77,495 విద్యార్థులకు 75,083 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2Newsలో<<>> చెక్ చేసుకోండి.
SHARE IT

News April 21, 2025

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చిల్పూర్ RI

image

భూ సర్వే కోసం రూ.26 వేలు లంచం తీసుకుంటూ RI ఏసీబీకి పట్టుబడ్డారు. చిల్పూర్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో RIగా పనిచేస్తున్న వినయ్ కుమార్ ఓ వ్యక్తి వద్ద భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. సోమవారం బాధితుడు రూ.26 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

error: Content is protected !!