News December 25, 2024
MDK: BJP కొత్త సారథులు ఎవరు?
ఉమ్మడి మెదక్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 14, 2025
MDK: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
News January 13, 2025
మెదక్: సంతోషంగా పండగను జరుపుకోవాలి: ఎస్పీ
మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ పర్వదిన వేళ ప్రజలందరికి ప్రశాంతతను, ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకున్నారు. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలాన్నారు.
News January 13, 2025
అందోల్: మాజీ ఎంపీ భౌతికకాయానికి మంత్రి నివాళులు
నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతికకాయానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు నివాళులు అర్పించారు. HYDచంపాపేట్‌లోని ఆయన నివాసానికి వెళ్లి జగన్నాథం కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. జగన్నాథంతో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి బాధాకరమని, ఎంపీగా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఓ సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.