News March 27, 2025
MDK: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం MDK, SRD, SDPT డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు.జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
Similar News
News March 30, 2025
MDK: వన దుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్

ఉగాది పర్వదినం పురస్కరించుకొని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవాని మాతను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సకుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరి పేర వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగి సూర్య శ్రీనివాస్ జిల్లా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు.
News March 30, 2025
జహీరాబాద్‌లో మహిళ దారుణ హత్య

మహిళ దారుణహత్యకు గురైన ఘటన జహీరాబాద్ పట్టణం పస్తాపూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. మహిళ కళ్లల్లో కారం చల్లి దారుణ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు ఝరాసంగం మండలం చీల మామిడికి చెందిన లక్ష్మి (55)గా గుర్తించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సందర్శించి హత్యకు గల కారణాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు.
News March 30, 2025
మెదక్: ‘తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు’

మెదక్ జిల్లాలో నేటి నుంచి జూన్ 1 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ బోర్డు శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ అధికారి మాట్లాడుతూ.. సెలవులలో తరగతులు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.