News March 18, 2024
MDK: హరీశ్‌రావు వ్యూహం.. BRS గెలుస్తుందా?

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో BRS జెండా ఎగరేసేందుకు ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఈసారి గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నట్లు శ్రేణులు చెబుతున్నాయి. మరి హరీశ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా చూడాలి.
Similar News
News August 16, 2025
MDK: ఏడుపాయల వరదను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

ఏడుపాయల పరిసర ప్రాంతాలను మెదక్ జాయింట్ కలెక్టర్ నగేశ్ సందర్శించి వరద పరిస్థితిని పర్యవేక్షించారు. సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జాయింట్ కలెక్టర్ నగేశ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News August 16, 2025
MDK: డైట్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు: ప్రిన్సిపల్

ప్రభుత్వ, ప్రైవేట్ డీఈడీ కళాశాలలలో భర్తీ కాకుండా మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు మెదక్ ప్రభుత్వ డైట్ ప్రిన్సిపల్ ప్రొ.డి.రాధాకిషన్ తెలిపారు. ఈనెల 19, 20 తేదీల్లో అడ్మిషన్ పొందాలన్నారు. డీసెట్-2025లో క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎల్ఈడీ, డీపీఎస్ఈ కోర్సులలో మార్గదర్శకాల ప్రకారం సంబంధిత కేటగిరిలో ఖాళీలను బట్టి ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు.
News August 16, 2025
మెదక్: అత్యధికంగా శివంపేటలో 128 మిమీ వర్షం

మెదక్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధికంగా శివంపేటలో 128 మిమీలు, నర్సాపూర్‌లో 108.8, కాగజ్ మద్దూర్‌లో 98.8, పెద్ద శంకరంపేటలో 89, బోడగట్టు ఈఎస్ఎస్ 74.5, కాళ్లకల్ 68 మిమీలు, మిగతా చోట్ల ఇంతకన్నా తక్కువ వర్షపాతం నమోదయింది.