News March 27, 2024

MDK: KCRకు ఇచ్చే GIFT అదే: MLA

image

మెదక్ ఎంపీ స్థానాన్ని గెలిచి BRS అధినేత KCRకు అసలైన గిఫ్ట్ ఇద్దామని ఆ పార్టీ శ్రేణులకు సంగారెడ్డి MLA చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోయినంత మాత్రాన శ్రేణులు నిరాశ చెందొద్దని, ఈసారి గెలుద్దామన్నారు.

Similar News

News January 25, 2026

మెదక్ పోలీస్ కార్యాలయం త్రివర్ణ శోభితం

image

గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం శనివారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో త్రివర్ణమయంగా మారింది. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకలకు కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అధికారులు పరేడ్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News January 24, 2026

MDK: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

బైక్ నియంత్రణ తప్పి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలై యువకుడు మృతి చెందినట్లు హవేలిఘనపూర్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. దూప్ సింగ్ తండాకు చెందిన సుభాష్(34) మెదక్ నుంచి ఇంటికి వస్తుండగా శివారులో ఈ ప్రమాదం జరిగింది. చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ కోలుకోలేక మరణించాడు. కుటుంబంలో చేతికి వచ్చిన కొడుకు మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది.

News January 23, 2026

సైన్స్ ఫెయిర్‌లో మెదక్ జిల్లాకు 3 బహుమతులు

image

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జరిగిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మెదక్ జిల్లా ప్రతిభ చాటిందని డిఈఓ విజయ తెలిపారు. టీచర్ ఎగ్జిబిట్ విభాగంలో కొడపాక జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు వెంకటరమణ ప్రథమ స్థానం సాధించారు. విద్యార్థుల విభాగంలో తూప్రాన్ గీత స్కూల్ విద్యార్థిని మహతి 3వ స్థానం, సిద్ధార్థ రూరల్ స్కూల్ విద్యార్థి అక్షయ్ 4వ స్థానంలో నిలిచారు. విజేతలను డిఈఓ అభినందించారు.