News March 18, 2024
MDK: భార్యతో గొడవ.. ఇంట్లోంచి వెళ్లి ఆత్మహత్య

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన మర్రి స్వామి(45) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో అతడు అప్పుడప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోతుండే వాడని, అలాగే ఈనెల 11న భార్య జ్యోతితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడన్నారు. ఈ క్రమంలో ఘనపూర్ గ్రామ శివారులో ఉరేసుకుని అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆదివారం రాత్రి స్థానికులు గుర్తించారన్నారు. మృతదేహం కుళ్లిపోయిందన్నారు.
Similar News
News April 6, 2026
MDK: అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలి: కలెక్టర్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, నివేదికలను త్వరితగతిన అందించాలని సూచించారు.
News April 6, 2026
మెదక్: ప్రజావాణిలో 98 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈవో ఎల్లయ్యలతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. మొత్తం 98 దరఖాస్తులు స్వీకరించారు.
News April 6, 2026
MDK: నేరుగా పోలీసులను సంప్రదించండి: డీఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ బాధితుల ఫిర్యాదులను స్వీకరించి, వేగంగా స్పందించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను వ్యక్తిగతంగా తెలుసుకుని, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి మార్గదర్శనం చేశారు.


