News May 11, 2024
MDK: RTC బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

నారాయణఖేడ్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న RTC బస్సులో ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందాడు. నాగధర్ గ్రామానికి చెందిన వడ్ల అంజయ్య సికింద్రాబాద్ బస్సు ఎక్కగా.. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కోలపల్లి శివారులో గుండెపోటు రాగా బస్సు సీటులోనే మృతి చెందాడు. డ్రైవర్ బస్సును నిలిపివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News November 16, 2025
కుటుంబానికి మూలశక్తి స్త్రీ: సత్యవాణి

భారతీయ కుటుంబానికి మూలశక్తి స్త్రీయే అని సామాజిక ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి అన్నారు. రామాయంపేట శిశు మందిర్లో సప్తశక్తి సంగం నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడలేని కుటుంబ వ్యవస్థ కేవలం మన భారతదేశంలోనే ఉందన్నారు. కుటుంబ బాధ్యతను అత్యంత సమర్థంగా నిర్వహించే శక్తి మహిళకే ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో మహిళ పాత్రే అత్యంత కీలకమన్నారు.
News November 16, 2025
రేపటి నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్: డీఎంఓ నాగరాజు

మెదక్ జిల్లాలో జిన్నింగ్(పత్తి) మిల్లుల బంద్ కారణంగా సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. కావున సమస్య పరిష్కారం అయ్యేవరకు రైతులు తమ పత్తిని మిల్లులకు తీసుకురావద్దని జిల్లా మార్కెటింగ్ అధికారి కే.నాగరాజు సూచించారు. సీసీఐ వారు జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో L1, L2 పద్ధతిని అనుసరించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగినట్లు ఆయన తెలిపారు.
News November 16, 2025
చేగుంట: ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా బంగారయ్య

చేగుంట మండలం చందాయిపేట హైస్కూల్ ఉపాధ్యాయులు గంగిశెట్టి బంగారయ్య ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. బంగారయ్యకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాండు, నర్సింలు, చేగుంట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంటగౌడ్, మనోహర్ రావు, కార్యవర్గ సభ్యులు సుధాకర్, సిద్ధిరాములు సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు వాణి శుభాకాంక్షలు తెలిపారు


