News May 11, 2024
MDK: RTC బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

నారాయణఖేడ్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న RTC బస్సులో ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందాడు. నాగధర్ గ్రామానికి చెందిన వడ్ల అంజయ్య సికింద్రాబాద్ బస్సు ఎక్కగా.. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కోలపల్లి శివారులో గుండెపోటు రాగా బస్సు సీటులోనే మృతి చెందాడు. డ్రైవర్ బస్సును నిలిపివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News February 9, 2025
మెదక్: కెనడా వెళ్లేందుకు సిద్ధం.. అంతలోనే ఆత్మహత్య

మనోహరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన యువకుడు అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మరాజుపల్లికి చెందిన శ్రీవర్ధన్ రెడ్డి (24) ఇటీవల డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏ చేసేందుకు కెనడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News February 9, 2025
మెదక్: నేడు హెల్ప్ డెస్క్ ద్వారా వినతుల స్వీకరణ: కలెక్టర్

10న సోమవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే వినతులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంపై కలెక్టర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సంబంధిత శాఖల జిల్లా అధికారులు విధుల్లో నిమగ్నమై ఉన్నందున అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండరని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 8, 2025
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్వేల్ చేగుంట ప్రధాన రహదారిపై చెట్ల నర్సంపల్లి సమీపంలో అతివేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.