News April 1, 2024

MDK, ZHB కాంగ్రెస్ ఇంఛార్జులుగా మంత్రులు రాజనర్సింహ, సురేఖ

image

మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులను నియమించింది. మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి మంత్రి కొండ సురేఖ, జహీరాబాద్ నియోజకవర్గానికి మంత్రి దామోదర రాజనర్సింహను ఇంఛార్జీగా, ఏఐసీసీ ఇంఛార్జీగా పీసీ విశ్వనాథ్‌ను నియమించారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News September 30, 2024

సిద్దిపేట: ‘జిల్లాలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి తప్పనిసరి’

image

సిద్దిపేట జిల్లాలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి తప్పనిసరి అని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 15 వరకు జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉంటుందని, ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. ముందస్తుగా అనుమతులు తీసుకుని ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని సూచించారు. డీజేల నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు.

News September 29, 2024

HYD: దూరవిద్య కోర్సుల పరీక్ష తేదీల ఖరారు!

image

PGRRCDE ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ. రాములు తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 5 నుంచి, పీజీడీసీఏ 1వ, 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి నిర్వహిస్తామన్నారు. వివరాలకు www.osmania.ac.in లో చూడాలన్నారు.

News September 29, 2024

రాష్ట్రపతి నిలయం కళా మహోత్సవానికి వర్గల్ నవోదయ విద్యార్థులు

image

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన అతిపెద్ద కళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్గల్ జవహర్ నవోదయ విద్యార్థులు 25 మంది పాల్గొన్నారని ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు భారతీయ కళా మహోత్సవంలో 430 మంది పాల్గొంటున్నారు.