News February 2, 2025

MDK: అండర్-19 అమ్మాయిల టీమ్‌కు మంత్రి అభినంద‌న‌లు

image

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలుపొందిన ఇండియా అమ్మాయిల టీమ్‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (3 వికెట్లు, 44 పరుగులు) జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. టోర్నీలో త్రిష అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారని అన్నారు. ఆమె మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని మంత్రి కోరారు.

Similar News

News February 2, 2025

MDK: రోగులకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య అధికారులను ఆదేశించారు. రామాయంపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఫార్మసి గది, రక్త పరీక్షలు ల్యాబ్, ఇన్ పేషెంట్స్ వార్డు, మందుల నిలువ స్టోర్ పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఆస్పత్రి నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

News February 2, 2025

నేను కొడితే మాములుగా ఉండదు.. : KCR

image

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ తన ప్రసంగాలతో కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇంతకాలం మౌనం పాటించిన కేసీఆర్ మొన్న(శుక్రవారం) ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జరిగిన సభలో స్పందించారు. నేను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. కొడితే మాములుగా కాదు గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు అని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్?

News February 2, 2025

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన శంకర్ గుప్త, చిట్కూల్‌కు చెందిన సురేశ్ గుప్త కుటుంబ సమేతంగా శ్రీశైలం వెళ్లి స్వగ్రామానికి వస్తున్నారు. శనివారం అర్ధరాత్రి మేడ్చల్ PS పరిధిలో కంటెయినర్‌ను కారు ఢీకొంది. దీంతో డ్రైవర్ నర్సింహా(28), శంకర్ (46), సురేశ్(45) అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.