News February 13, 2025
MDK: అనారోగ్యంతో మహిళా కానిస్టేబుల్ మృతి

సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పైసా స్వప్న కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. దీంతో స్వప్న స్వగ్రామమైన వీరన్నపేటలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆమె మృతి పట్ల సీఐ ఎల్ శ్రీను, ఎస్ఐ నీరేష్, పోలీస్ సిబ్బంది, పలువురు నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు.
Similar News
News April 23, 2025
మెదక్: ‘నేడు ఈ 7842651592 నంబరుకు చేయండి’

ఆర్టీసీ మెదక్ డిపోలో బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంగళవారం డిపో మేనేజర్ సురేఖ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికులు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 7842651592 నంబరుకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ప్రయాణికులు తెలిపిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు.
News April 23, 2025
వెల్దుర్తి: భూవివాదంలో వ్యక్తిపై కత్తితో దాడి

పొలం వివాదంలో ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన జయరాములు అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కానికే రవి పాత గొడవలు మనసులో పెట్టుకుని పొలం వివాదంలో రాత్రి కత్తితో దాడి చేశారు. దీంతో గాయాలైన జయరాములు బంధువులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేశామని తెలిపారు.
News April 22, 2025
మెదక్: ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలదే హవా.!

మెదక్ జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో విద్యార్థులు 49.21% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6,153 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3,028 పాస్ అయ్యారు. 3125 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో బాలుర ఉత్తీర్ణత శాతం 39.09 % కాగా, బాలికలు 57.05 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు పైచేయి సాధించడంతో జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.