News March 2, 2025
MDK: ఐఐటిహెచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

సంగారెడ్డి జిల్లా ఐఐటి హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఐఐటి విద్యార్థులు, అధ్యాపకులతో సంభాషించారు.
Similar News
News March 3, 2025
మెదక్: ‘ప్రజావాణికి 24 దరఖాస్తులు’

ప్రజావాణి కార్యక్రమానికి 24 దరఖాస్తులు వచ్చాయని అదనపు జిల్లా కలెక్టర్ నగేశ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పలు సమస్యలపై దరఖాస్తులు రాగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. భూ సమస్యలు ఉన్నవారు తమ తమ మండల కేంద్రంలోని తహశీల్దారులకు సోమవారం అర్జీలు పెట్టుకోవాలని కలెక్టర్ కోరారు.
News March 3, 2025
కరాటే మాస్టర్ నగేష్‌కు హీరో సుమన్ అభినందనలు

వరల్డ్ రికార్డ్ సాధించిన కరాటే మాస్టర్ నగేష్‌కు సినీహీరో సుమన్ అభినందించారు. చెన్నైలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిర్వహించారు. ఈ లార్జెస్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో 3 వేల మంది కరాటే మాస్టర్స్ మన దేశం నుంచి హాజరయ్యారు. తెలంగాణ నుంచి తెలంగాణ సీనియర్ కరాటే మాస్టర్ నగేష్ ప్రాతినిధ్యం వహించగా 40 మంది నగేష్ వద్ద శిక్షణ పొందుతున్న కరాటే మాస్టర్స్ పాల్గొన్నారు.
News March 3, 2025
సంగారెడ్డి: తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తెల్లాపూర్‌లోని దివినో విల్లాస్‌లో తల్లి రాధిక(52)పై కొడుకు కార్తీక్ రెడ్డి కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధిక చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని చెప్పారు.